బీసీలపై కక్ష సాధింపు చర్యలు తగవు
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:58 PM
బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ నాయుడు అన్నారు.
నంద్యాల రూరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ నాయుడు అన్నారు. పట్టణంలోని పద్మావతి నగర్‌లో జ్యోతిరావు పూలే విగ్రహానికి గురువారం పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలపై దాడులు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. బీసీలకు రక్షణ కరవైందని ఆరోపించారు. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌పై దాడికి నిరసనగా నంద్యాలలో నిరసన తెలిపినట్లు తెలిపారు. నాయకులపై కక్ష సాధింపు చర్యలు మంచిది కాదన్నారు. బీసీ నాయకులు పుల్లయ్య, చిన్నబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.