పని వేళలు పాటించకపోతే చర్యలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:08 AM
అధికారులు సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ హెచ్చరించారు.
నందవరం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అధికారులు సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ హెచ్చరించారు. నదికైరవాడి గ్రామంలో బుధవారం అదనపు ఎంపీడీవో సందీప్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారి దగ్గర నుంచి అర్జీలు స్వీకరించారు. డీపీవో మాట్లాడుతూ సర్వే రికార్డుల నిర్వహణ 9(2) 10ల ఇంటి యజమానులకు అందజేసే ఈ సర్వే ప్రాధాన్యత, వీటి ప్రయెజనాల గురించి అవగాహన కల్పించారు. గ్రామ సభలో కొందరికి 9(2) నోటీసులను ఇంటియజమానులకు ఇవ్వడంతో పాటు కచ్చితంగా కొలతలతో కూడిన నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం లేకుండా సరైన రికార్డులను ప్రజలకు అందజేయడానికి సచివాలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరమ్మ, టీడీపీ క్లస్టర్ ఇన్‌జార్జి వీరేష్ పాల్గొన్నారు.