Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - May 15 , 2025 | 12:26 AM

వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: డీఎంహెచ్‌వో
వైద్య సేవల వివరాలను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

బండిఆత్మకూరు, మే 14(ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ హెచ్చరించారు. మండలంలోని బి.కోడూరు గ్రామంలో బుధవారం నిర్వహిస్తున్న 104 సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సబ్‌ సెంటర్‌లో ప్రజలకు అందిస్తున్న వైద్య పరీక్షలు, చికిత్సల రిజిస్టర్లను, గర్భిణుల వివరాలు, సిబ్బంది హాజరు, ఎన్‌సీడీసీడీ సర్వే రికార్డులను డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అన్ని వేళలా అందించాలన్నారు. శింగవరం గ్రామంలోని సబ్‌సెంటర్‌ను ఎంపీడీవో దస్తగిరి తనిఖీ చేసి రికార్డులను పిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ భావన, పీఎస్‌లు శ్రీకాంత్‌, రాంగోపాల్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:26 AM