చెరువును అక్రమిస్తే చర్యలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:28 PM
చెరువును ఆక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆదోని సబ్ డివిజన్ మైనర్ ఇరిగేషన్ అధికారి చెన్నకేశవ నాయక్, జేఈ పణి హెచ్చరించారు. ఆలూరు చెరువు ఆక్రమణను గురువారం పరిశీలించి, రాళ్ళను తొలగించారు.

ఎంఐ డీఈఈ చెన్నకేశవ్ నాయక్
ఆలూరు, జనవరి16 (ఆంధ్రజ్యోతి): చెరువును ఆక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆదోని సబ్ డివిజన్ మైనర్ ఇరిగేషన్ అధికారి చెన్నకేశవ నాయక్, జేఈ పణి హెచ్చరించారు. ఆలూరు చెరువు ఆక్రమణను గురువారం పరిశీలించి, రాళ్ళను తొలగించారు. ఆలూరు సీఐ వెంకటచలపతి, తహసీల్దార్ గోవింద్ సింగ్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు విలేఖరులకు తెలి పారు. ఇకపై చెరు వు స్థలం అన్యాక్రాం తం కాకుండా నిఘా ఉంచుతా మన్నారు. అనుమ తి లేకుండా చెరువు మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేయిస్తా మన్నారు.
ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి
ఆలూరు చెరువు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు హనుమంతు, షాకీర్, కృష్ణ, డీవైఎఫ్‌ఐ నాయకులు మైనా డిమాండ్ చేశారు. మైనర్ ఇరిగేషన్ డీఈఈ చెన్నకేశవ నాయక్‌ను కలసి వినతిపత్రం అందించారు. అక్రమణదా రులపై కేసు నమోదు చేసి, ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిచాలని కోరారు.