ఆక్సిజన పైపులైన పనులు వేగవంతం
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:55 AM
స్టేట్ క్యాన్సర్ ఇనస్టిట్యూట్‌లో ఆక్సిజన పైపులైన పనులు వేగవంతంగా జరుగుతున్నా యని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు అ న్నారు.

కర్నూలు హాస్పిటల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): స్టేట్ క్యాన్సర్ ఇనస్టిట్యూట్‌లో ఆక్సిజన పైపులైన పనులు వేగవంతంగా జరుగుతున్నా యని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు అ న్నారు. బుధవారం ఆయన క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డా.కృష్ణప్ర కాష్‌తో కలిసి పనులను తనిఖీ చేశారు. క్యాన్సర్ విభాగంలో డే కేర్ కీమోథెరపి రోగులకు అందిస్తున్నామని, క్యాన్సర్ విభాగంలో అల్ర్టాసౌండ్ యంత్రాన్ని అమర్చి ప్రక్రియ పూర్తి చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.