Share News

వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:16 AM

మిడుతూరులోని పోతులూరి వీరబ్రహ్మం గారి మఠం ఆవరణంలో 40 అడుగుల అభయ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ, మఠం ధ్వజ స్తంభ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగాయి.

 వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ
40 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న దృశ్యం

మిడుతూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): మిడుతూరులోని పోతులూరి వీరబ్రహ్మం గారి మఠం ఆవరణంలో 40 అడుగుల అభయ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ, మఠం ధ్వజ స్తంభ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగాయి. టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ మండల కన్వినర్‌ కాతా రమేష్‌ రెడ్డి, నందికొట్కూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ప్రసాద రెడ్డి, మాండ్రలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:16 AM