దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:01 AM
ఉమ్మడి ఆంధ్రప్ర దేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.రంజిత బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్ర దేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.రంజిత బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకటనారాయణమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ తులసిదేవి, యోగేష్ నాయక్ పాల్గొన్నారు.
కర్నూలు క్రైం: నిజాయితీకి మారుపేరు దామోదరం సంజీవయ్య అని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ అడ్మిన హుశేనపీరా, ఏఆర్ అడిషినల్ ఎస్పీ కృష్ణమోహ న, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన: ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కర్నూలు నగరంలో కలెక్టరేట్ నుంచి విద్యార్థులు, అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల చెక్ పోస్ట్ వద్ద దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రంజిత భాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మె ల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. సంజీవ య్య అన్న కుమారుడు దామోదరం రాధాకృష్ణను ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్యపై గుర్రం జాషువా రచించిన పద్యాలను సంజీవయ్య మేనల్లుడు, రిటైర్డ్ హెచఎం ఎర్రమ పాండురంగయ్య ఆలపించారు.
ఫ స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం దామోదరం సంజీవయ్య చిత్రపటానికి ప్రిన్సిపాల్ ఎస్.నాగ స్వామి నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కర్నూలు న్యూసిటీ: జిల్లా పరిషత మినీ సమావేశ భవనంలో జడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారులు సరస్వతమ్మ, సి.మురళీమోహనరెడ్డి, జితేంద్ర, బసవశేఖర్, పుల్లయ్య, నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఫ నగర పాలక సంస్థ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఆరోగ్య అధి కారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌ఓ జునైద్, అకౌంట్స్ ఆఫీసర్ చుండీప్రసాద్, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ఫ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వచ్ఛ భారత రచ్చబండ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాతబస్టాండు సమితి కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నాయ కులు నాగరాజు, సుఽధాకర్ బాబు, గిరిధర్, రంగముని పాల్గొన్నారు.
కర్నూలు అర్బన: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి మాజీ ఎమ్మెల్సీ సుఽధాకర్ బాబు పూలమా లలు వేసి నివాళి అర్పించారు. ఎనసీ బజారన్న, లాజరస్, షేక్ ఖాజా హస్సేన, ఎస్ ప్రమీల, వెంకట సుజాత పాల్గొన్నారు.
ఫ క్లస్టర్ యూనివర్సిటీ పరిఽధిలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపాల్ ఇందిరాశాంతి దామోదరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ జే.హేమంత, సత్యనారాయణ, మాదన్న, వెంకటస్వామి పాల్గొన్నారు.
ఫ రాయలసీమ యూనివర్సిటీలో దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి ఇనచార్జి ఉపకులపతి ప్రొఫెసర్ ఎనటీకే నాయక్, రిజిసా్ట్రర్ విజయకుమార్‌లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో డైరెక్టర్ విశ్వనాథరెడ్డి, కంట్రోలర్ ఎస్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ హరిప్రసాదరెడ్డి, ఎనఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పి.నాగరాజు పాల్గొన్నారు.
కర్నూలు లీగల్: నేషనల్ లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన సమీపంలో ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లాయర్స్ ఫోరం అధ్యక్షుడు వై.జయరాజు, న్యాయవాదులు, మాదన్న, బి.చిన్నయ్య, మాసి పోగు సుబ్బయ్య, జానబాబు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసులు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంగనవాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు, ఆర్‌ఐ పాణ్యం శ్రీనివాసులు, సచివా లయ సర్వేయర్లు పాల్గొన్నారు.