Share News

భగత్‌సింగ్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:47 PM

స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతిని పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

భగత్‌సింగ్‌కు ఘన నివాళి
ఎమ్మిగనూరులో నివాళి అర్పిస్తున్న నాయకులు

ఎమ్మిగనూరు రూరల్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతిని పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు టౌన్‌: పట్టణంలోని భగత్‌ కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డీవైఎఫ్‌ఐ పట్టణ నాయకుడు మోహన్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు సురేశ్‌, అలాగే రాకేష్‌, ఉదయ్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలయం: మంత్రాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్ర సర్కిల్‌లో ఏఐవైఎఫ్‌ మండల సమితి టౌన్‌ అధ్యక్షులు మురళి, మంచాల సింగిల్‌ విండో సొసైటీ డైరెక్టర్‌ నగేశ్‌ నివాళి అర్పించారు. ఏఐవైఎఫ్‌ నాయకులు రాజు, విజయ్‌, ధనుష్‌, రాజు, సందీప్‌, అజయ్‌, ఆదిల్‌, రిషి పాల్గొన్నారు.

పెద్దకడబూరు: యువకుల్లో క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని డీవైఎఫ్‌ఐ- ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ నాయకులు రాజు, విల్సన్‌, దేవదాసు అన్నారు. ఆదివారం పెద్దకడబూరులోని భగత్‌ సింగ్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ- ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు.

Updated Date - Sep 28 , 2025 | 11:47 PM