Share News

అంబేడ్కర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:08 AM

పట్టణంలోని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటి వద్ద అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు.

అంబేడ్కర్‌కు ఘన నివాళి
అంబేడ్కర్ చిత్ర పటం నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటి వద్ద అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమేశ్వరరెడ్డి, మహేశ్‌, దావీదు, ఉరుకుందు, విజయలక్ష్మి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలయం: మంత్రాలయంలో శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కేం జానయ్య, ఏపీ ఎమ్మార్పీఎస్‌ జిలా అధికారి ప్రతినిధి యోబు, సుంకేశ్వరి గ్రామంలో బీఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్‌, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధక్షుడు జయ రాజు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేశ్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు.బీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు స్వామినాథన్‌, అడ్వకేట్‌ కిషోర్‌, దేవా, బాలస్వామి, జిల్లా కార్యదర్శి గర్జి హనుమన్న, రత్నం, యోహన్‌, చిన్న, నరసింహులు,అనీల్‌ కుమార్‌, మారెన్న, నాగేంద్ర, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

కౌతాళం: కౌతాళంలో దళిత సంఘం నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జైభీమ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కామవరం గ్రామంలో సర్పంచ్‌ వసంత, గుడికంబాలిలో ఆనంద్‌, బాపురంలో జయపాల్‌ ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు.

పెద్దకడబూరు: పెద్దకడబూరుతో పాటు గ్రామాల్లో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. టీడీపీ నాయకులు బొగ్గుల తిక్కన్న, ఎమ్మార్పీఎస్‌ నాయకులు యువరాజ్‌, సతీష్‌, బైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు బుజ్జప్ప, ఆదామ్‌, అలాగే నాయకులు నాగరాజు, సామేలు, యేసన్న, రాజ్‌కుమార్‌, ప్రభాకర్‌, శీమోన్‌, నవీన్‌ పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు టౌన్‌: పట్టణంలో జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌, సమతా సైనికదళ్‌, పూలే అంబేడ్కర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ నాయకులు అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. సమతా సైనికదళ్‌ రాష్ట్ర కార్యదర్శి రంగయ్య, పూలే అంబేడ్కర్‌ సొసైటీ గౌరవాధ్యక్షులు ఆల్‌ఫ్రెడ్‌రాజ్‌, బీజేపీ నాయకులు గురురాజ్‌దేశాయ్‌, జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ బుజ్జి, చార్లెస్‌, నరసన్న, బతుకన్న తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు రూరల్‌: పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కో-కన్వీనర్‌ కాశీంవలి, నాయకులు పాల్గొన్నారు. అలాగే గుడికల్లులో అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు.

గోనెగండ్ల: గోనెగండ్లలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు కరుణాకర్‌, నాయకులు ప్రసాద్‌, సరేష్‌, పెద్దయ్య, సీఐటీయూ నాయకులు నబీరసూల్‌, కేజీబీఎస్‌ మండల అధ్యక్షుడు మునిస్వామి, విజయ్‌, రాఘవేంద్ర, వీరన్నగౌడ్‌, రహీంబాషా, బాబు, రాజు, కిట్టు పాల్గొన్నారు.

నందవరం: హాలహర్వి సర్పంచ్‌ తిమ్మప్ప, కనకవీడులో డబ్బా ఈరన్న ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్ర మాల్లో దళిత నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:08 AM