Share News

అవయవ దాతకు అశ్రు నివాళి

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:52 AM

అవయవ దాత పావని లత మరణించినప్పటికి ఆరుగురికి తన అవయవా లను దానం చేసి ప్రాణం పోసిందని జనవిజ్ఞాన వేధిక రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్‌ కుమార్‌ కొనియాడారు.

అవయవ దాతకు అశ్రు నివాళి
కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తున్న సభ్యులు

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): అవయవ దాత పావని లత మరణించినప్పటికి ఆరుగురికి తన అవయవా లను దానం చేసి ప్రాణం పోసిందని జనవిజ్ఞాన వేధిక రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్‌ కుమార్‌ కొనియాడారు. అవయవదానం చేసి ఏడాది పూర్తయిన సంద ర్భంగా పావని లతకు శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌ ఎదుట మానవత, జేవీవీ, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆమెకు నివాళులర్పిస్తూ కొవ్వొతుల ప్రదర్శన నిర్వహించారు. అవయవదానం చేసిన దాతల కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో మానవతా జిల్లా కన్వీనర్‌ మనోహర్‌ రెడ్డి, పాటిల్‌ హను మంతరెడద్డి, మహిళా విభాగం నాయకులు అపర్ణ, దీప, లక్ష్మి, సాంబ, సరోజ, లెక్చరర్‌ సుంకన్న, అరుణ పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:53 AM