‘ఉద్యోగావకాశాలు కల్పించే దాకా ఉద్యమం’
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:02 AM
ఉద్యోగావకాశాలు కల్పించే దాకా కార్మికుల ఉద్యమం ఆగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప అన్నారు.
ఎమ్మిగనూరు టౌన్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగావకాశాలు కల్పించే దాకా కార్మికుల ఉద్యమం ఆగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప అన్నారు. మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలంటూ పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకుంది. గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ శివకృష్ణ అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ మున్సిపాలిటటీలో విధులు నిర్వర్తిస్తూ 13 మంది మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించి, జీవో నెంబర్ 25 ప్రకారం రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. అదే విధంగా కార్మికులకు ఇవ్వాల్సిన కొబ్బరి నూనె, యూనిఫామ్, సరెండర్ లీవ్‌ల డబ్బు చెల్లించాలన్నారు. ఐఎఫ్టీయూ జల్లా అధ్యక్షడు ప్రసాద్, సీపీఐ పట్టణ కార్యదర్శిలు రంగన్న, విజయేంద్ర, ఏఐటీయూసీ కార్యదర్శి తిమ్మగురుడు, రాజీవ్, భీమన్న తదితరులు పాల్గొన్నారు.