అడిషనల్ ఎస్పీకి ఆత్మీయ వీడ్కోలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:37 AM
నంద్యాల జిల్లా సాయుధబలగాల అడిష నల్ ఎస్పీ చంద్రబాబు బదిలీపై విజయవాడకు వెళ్తున్న సంద ర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

నంద్యాల టౌన్, జూలై 4(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా సాయుధబలగాల అడిష నల్ ఎస్పీ చంద్రబాబు బదిలీపై విజయవాడకు వెళ్తున్న సంద ర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పాల్గొని మాట్లాడారు. నంద్యాల జిల్లాలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. అనంతరం సన్మానించి గిఫ్ట్ అందజేశారు. ఏఎస్పీ మందా జావళి, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌కుమార్, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.