కౌలూరులో బీహార్ సర్పంచ్‌ల బృందం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:51 AM
మండలంలోని కౌలూరు గ్రామాన్ని శుక్రవారం బీహార్ రాష్ట్ర సర్పంచ్‌లు సందర్శించారు.
పాణ్యం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కౌలూరు గ్రామాన్ని శుక్రవారం బీహార్ రాష్ట్ర సర్పంచ్‌లు సందర్శించారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థపై అధ్యయనం చేయడానికి ఈ బృందం వచ్చినట్లు కౌలూరు సర్పంచ్ బాలయ్య తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ వ్యవస్థ తీరుపై అధ్యయనం చేయడానికి బీహార్ నుంచి 35 మంది సర్పంచ్‌లు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బృందం పంచాయతీ పరిపాలన విధానం, సిబ్బంది పనితీరు, పన్నుల వసూలు, చెత్త సంపద కేంద్రాల వినియోగం, తాగునీరు, పారిశుధ్యం, పంచాయతీ నిర్వహణ, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వ సహకారం, సచివాలయం ద్వారా ప్రజా సేవలు వంటి వాటిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిఽధి నాగేశ్వరరావు ఎంపీటీసీ భాస్కరరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాధ, సిబ్బంది పాల్గొన్నారు.