Share News

వీర జవాన్‌కు ఘన నివాళి

ABN , Publish Date - May 11 , 2025 | 12:19 AM

ఆపరేషన్‌ సిందూర్‌లో అమరులైన మురళీనాయక్‌కు పాణ్యంలో శనివారం మాజీ సైనికులు నివాళి అర్పించారు.

వీర జవాన్‌కు ఘన నివాళి
పాణ్యంలో మురళీ నాయక్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న పోలీసులు, మాజీ సైనికులు

పాణ్యం, మే 10 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌లో అమరులైన మురళీనాయక్‌కు పాణ్యంలో శనివారం మాజీ సైనికులు నివాళి అర్పించారు. పాణ్యం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను స్మరించుకోవాలన్నారు. ఈసమయంలో ప్రజలు భారత సైనికులకు అండగా ఉండి మానసిక ధైర్యాన్ని అందిచాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈసందర్భంగా మురళీనాయక్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, మాజీ సైనికులు మురారి లక్ష్మన్న, కృష్ణయ్య, ఎల్లా కృష్ణయ్య, హుస్సేన్‌, వెంకటరెడ్డి, చెన్నకేశవులు, కైలాసపతి, సుబ్బరాయుడు, వెంకటాద్రి, ప్రతాప్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:19 AM