ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:43 AM
మండలంలోని పెసలదిన్నె గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఎమ్మిగనూరు రూరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెసలదిన్నె గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అచలానంద బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విరజానందస్వామి, ఆర్‌ఎస్‌ఎస్ కర్నూలు జిల్లా విభాగ్ ప్రచారక్ సురేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికత భారతదేశానిది అని అన్నారు. భారతదేశంలో ఉన్న సనాతన హిందూ ధర్మం గొప్పదనం ప్రపంచానికే తెలిసిందన్నారు. అయితే ఇంత గొప్పదేశంలో పుట్టిన మనకు దేశ ఔనత్యం గురించి తెలియదన్నారు. ప్రపంచం బాగుండాలని, అన్ని దేశాలు బాగుండాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. మహాభారత, భగవద్గితను చదివి అహింసను వదలాలన్నారు. కార్యక్రమంలో భగవద్గీత ప్రచారకురాలు తులశమ్మ, శ్రీనివాసులు, ఆయా గ్రామాల మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.