Share News

ఘనంగా కవి సమ్మేళనం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:11 AM

నంద్యాల జిల్లా ముస్లిం రచయితల సంఘం(మురసం) ఆధ్వర్యంలో నంద్యాల నడిగడ్డలోని రాయల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రమజాన్‌ కవి సమ్మేళనం వైభవంగా నిర్వహించారు.

ఘనంగా కవి సమ్మేళనం
కవులు, రచయితలను సన్మానిస్తున్న నిర్వాహకులు

నంద్యాల కల్చరల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ముస్లిం రచయితల సంఘం(మురసం) ఆధ్వర్యంలో నంద్యాల నడిగడ్డలోని రాయల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రమజాన్‌ కవి సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో తెలుగు, ఉర్దూ కవుల కవితలతో మతసామరస్యం వెల్లివిరిసింది. మురసం అధ్యక్షుడు ఎంఎండీ రఫీ అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నౌమాన్‌, ఆత్మీయ అతిథులుగా మురసం రాష్ట్ర ఉపాధ్య క్షుడు అబ్దుల్‌ సమద్‌, అభ్యుదయ రచయితల సంఘం అధ్య క్షుడు ముర్తుజా హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ దేశంలో మత సామ రస్యం కోసం సాహిత్యప్రియులు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 18మంది తెలుగు, ఆరుగురు ఉర్దూ కవులు పాల్గొన్నారు. రచనలు సామాజిక రుగ్మతలకు దూరం చేయాలని, రాబోయే తరాలకు రచనా సాహిత్యం పెంచేలా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కవులు కొప్పుల ప్రసాద్‌, మహబుబ్‌ బాషా, మద్దిలేటి, రఫి, ముస్లిం ప్రదాన కార్యదర్శి మహబుబ్‌బాషా, తదితర కవులు, ఉపాద్యాయులు పాల్గొని కవితలు వినిపించారు. అనంతరం కవులందరికి ముఖ్య అతిధుల చేతులమీదుగా శాలువా కప్పి, మెమెంటోతో సత్కరించారు.

Updated Date - Apr 12 , 2025 | 12:11 AM