Share News

వైభవంగా విజయదశమి

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:54 AM

ఎమ్మిగనూరు పట్టణంలో దసరశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

వైభవంగా విజయదశమి
కందనాతి గ్రామంలో వేడుకల్లో పాల్గొన్న భక్తులు

ఎమ్మిగనూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణంలో దసరశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఆయా ప్రాంతాల్లో వెలసిన అమ్మవారి ఆలయాల్లో విజయదశమిని పురష్కరించుకొని గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత కన్యకా పరమేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆలయ నిర్వాహకులు సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాచాని మహేశ్‌, సంఘం అధ్యక్షుడు ప్రతాప్‌ శ్రీకాంత్‌, వెంకటగిరి, సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు రూరల్‌: ఎమ్మిగనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా కందనాతి గ్రామంలోని కొండపై వెలసిన చెన్నకేశవస్వామి పల్లకోత్సవాన్ని కందనాతితో పాటు మసీదుపురం, మాస్‌మాన్‌దొడ్డి, వెంకటగిరి గ్రామాల ప్రజలు కొండపై నుంచి కడివెళ్ల రహదారిలో ఉన్న జమ్మిచెట్టువరకు భుజాలపై మోస్తు ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి యథాస్థానికి చేర్చారు. పల్లకోత్సవంలో వెంకటగిరి గ్రామానికి చెందిన బోయ ఈశ్వర్‌కు ఎడమ భుజంపై తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రెఫర్‌ చేశారు. అలాగే కందనాతి గ్రామానికి చెందిన ఓ భక్తుడితో పాటు వెంకటగిరి గ్రామానికి చెందిన కోట ఉరుకుందు, రామాంజిని, సురేంద్ర, వీరేశ్‌కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ ఎస్‌ఐ కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కందనాతి గ్రామంలో లక్ష్మీచెన్నకేశవస్వామి, మారెమ్మవ్వలను దర్శించుకున్నారు.

గోనెగండ్ల: మండలంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజులదిన్నె ప్రాజెక్టులో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు.

మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంతో పాటు మండలంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. గురు, శుక్రవారాలు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు జమ్మీవృక్షానికి పూజలుచేసి హరతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదించారు. మంచాలమ్మ దేవతకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రంలో 9 రోజులపాటు పూజలు అందుకున్న కన్యకాపరమేశ్వరి దేవతను, మాధవరంలో గంగాభవానీ దేవతను ప్రత్యేక వాహనాలపై ఉంచి భారీ ఊరేగింపు నిర్వహించి తుంగభద్ర నదిలో నిమజ్జనం చేశారు.

పెద్దకడబూరు: మండలంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.

Updated Date - Oct 04 , 2025 | 12:54 AM