Share News

సాధనతోనే ఉజ్వల భవిష్యత్తు

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:44 PM

క్రీడాకారులు సాధన చేసి ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

సాధనతోనే ఉజ్వల భవిష్యత్తు
టెన్నిస్‌ ఆడుతున్న టీజీ వెంకటేశ్‌

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌

కర్నూలు స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు సాధన చేసి ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. శనివారం స్థానిక కర్నూలు క్లబ్‌ టెన్నిస్‌ గ్రౌండులో ఏర్పాటు చేసిన 8వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్య, ఉద్యోగ అవకాశాలు ఉండే క్రీడలను ఎంచుకోవాలని అన్నారు. తద్వారా ఆరోగ్యం మానసిక వికాసం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌వేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నవీన్‌ కుమార్‌, జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.రామాంజనేయులు, జిల్లా సంఘం కార్యదర్శి నవీన్‌ శావల్‌, పీఠల సంఘం ప్రతినిధి కొండేపి చిన్న సుంకన్న, సుప్రీయ, గీత సంఘం ప్రతినిధులు రేవంత్‌, సురేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు గీత, సుప్రియ, రంగస్వామి పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:44 PM