మద్యం దుకాణాల కోసం 133 దరఖాస్తులు
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:54 PM
మద్యం దుకాణాల కోసం 133మంది గీత కులస్థులు దరఖాస్తులు చేసుకోగా రూ. 2.66 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎం, సుధీర్ బాబు తెలిపారు.

ప్రభుత్వానికి రూ. 2.66 కోట్ల ఆదాయం
రేపు జిల్లా పరిషత్‌లో లాటరీ పద్ధతిన ఎంపిక
ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు
కర్నూలు అర్బన్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల కోసం 133మంది గీత కులస్థులు దరఖాస్తులు చేసుకోగా రూ. 2.66 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎం, సుధీర్ బాబు తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లాలోని పది ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో సేకరించిన దరఖాస్తుల పరిశీలించారు. రాయలసీమ స్థాయిలో జిల్లాలోని పది మద్యం దుకాణాలకు సంబంధించి అత్యధిక దరఖాస్తులు చేసుకోగా, కర్నూలు ఎక్సైజ్ స్టేషన్‌లో 60 మంది దరఖాస్తు చేసుకోడం రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈనెల 10న జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన లాటరీ పద్ధతిన దుకాణాల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. 10 దుకాణాలకు సంబంధించి కర్నూలు 60, ఎమ్మిగనూరు 12, ఆదోని 15, కృష్ణగిరి 2, ఆదోని రూరల్ 10, కౌతాళం 8, మద్దికేర 4, కోసిగి 9, చిప్పగిరి 4, ఆస్పరి దుకాణానికి 7 దరఖాస్తుల వచ్చాయన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దుకాణాల కేటాయింపునకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.