Share News

గీత కులస్థులకు 10 దుకాణాలు

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:53 PM

గీత ఉప కులాలకు 10 మద్యం దుకాణాలను ఖరారు చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌బాబు, డిప్యూటీ కమీషనర్‌ పోతుల శ్రీదేవి ఆధ్వర్యంలో జాయింట్‌ కలెక్టర్‌ నవ్య లాటరీ పద్ధతిలో ఎంపికి చేశారు.

గీత కులస్థులకు 10 దుకాణాలు
లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్న జేసీ

ఏడుగురిలో ఒక మహిళకు దుకాణం

109కి చేరిన మద్యం దుకాణాలు

సీమలో కర్నూల్లో పోటా పోటీ..

రూ. 51.66 లక్షల ఆదాయం

లాటరీ ద్వారా ఎంపిక చేసిన జేసీ

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): గీత ఉప కులాలకు 10 మద్యం దుకాణాలను ఖరారు చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌బాబు, డిప్యూటీ కమీషనర్‌ పోతుల శ్రీదేవి ఆధ్వర్యంలో జాయింట్‌ కలెక్టర్‌ నవ్య లాటరీ పద్ధతిలో ఎంపికి చేశారు. జిల్లాలో 99 మద్యం దుకాణాలుండగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గీత కులాలకు పదిశాతం లెక్కన పది దుకాణాలను కేటాయించడంతో ఆ సంఖ్య 109కి చేరింది. రాయలసీమ జిల్లాలోనే లాటరీ పద్ధతిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి కర్నూల్లో పోటీ పడి దరఖాస్తులు వేశారు. ఏడుగురు మహిళలుఽఽ దరఖాస్తు చేసుకోగా కోసిగి నుంచి ఈడిగ సుజాత అనే మహిళకు లాటరీలో దుకాణం దక్కింది. లాటరీ ప్రక్రియలో అవకాశం దక్కక పోవడంతో నిరాశతో పలువురు వెనుతిరిగారు. ఫలితంగా దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 2.66 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్రక్రియకు జిల్లాలోని 10 దుకాణాలకు వివిధ ప్రాంతాల నుంచి 133 మంది దరఖాస్తుదారులు జిల్లా పరిషత్‌ సమావేశ భవనానికి చే రుకున్నారు. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడా చిన్న సంఘటన కూడా చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కానీ నిర్దేశించిన సమయానికి కలెక్టర్‌ రాక పోవడంతో జాయింట్‌ కలెక్టర్‌ నవ్య చేరుకుని ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ముందుగానే పలు ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులు దాదాపు రెండు గంటల పాటు నిరీక్షించారు. దరఖాస్తుదారులను ఎక్సైజ్‌ పోలీసులు సముదాయిస్తూ వారిని కూర్చోబెట్టేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. జిల్లాలోని ఎక్సైజ్‌ సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుని ఆయా స్టేషన్‌ల పరిఽధిలో దరఖాస్తు చేసుకున్న ఽ వారి వెంటనే ఉండి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కర్నూలు నగర పాలక సంస్థ నుంచి ఈడిగ ధర్మేంద్ర, ఎమ్మిగనూరుకు ఈడిగ నాగేంద్ర, ఆదోని మున్సిపాలిటీకి ఈడిగ ప్రవీణ్‌కుమార్‌, ఆదోని రూరల్‌కు ఈడిగ ఉరుకుందప్ప, క్రిష్ణగిరి ఈడిగ జ్యోతి గౌడ్‌, కౌతాళం ఈడిగ బసవరాజు, మద్దికెరకు ఈడిగ మదన గోపాల్‌, కోసిగి ఈడిగ సుజాత, చిప్పగిరి పెద్ద పూజర్ల చంద్ర శేఖర్‌, ఆస్పరి గిడ్డయ్య గౌడ్‌ లాటరీ పద్ధతిలో దుకాణాలు దక్కించుకున్నారు. 2024-25 లైసెన్స్‌ కాలానికి 50 శాతం రాయితీపై 10 దుకాణాల్లో ఒక్కో దానికి రూ. 5 లక్షల చొప్పున ఫీజు రూపంలో రూ. 51,666,69 లక్షలు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ. 2.06,671 కోట్లు వీరు చెల్లించాల్సి ఉండగా అందులో నాల్గవ వంతు చెల్లించి దుకాణాలు దక్కించుకున్నారు. లైసెన్స్‌దారులకు దుకాణాలు కేటాయించే విషయంపై ప్రభుత్వం స్పష్టత రావ్వాల్సి ఉంటుంది.

Updated Date - Feb 10 , 2025 | 11:53 PM