Protest by Hindu communities
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:11 AM
మాన్యం అన్యా క్రాంతమైతే చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్, బజరంగదల్ జిల్లా నాయకులు వైవీ రామయ్య, భాగిరెడ్డి నాగిరెడ్డి అన్నారు.
నందికొట్కూరు రూరల్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): మాన్యం అన్యా క్రాంతమైతే చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్, బజరంగదల్ జిల్లా నాయకులు వైవీ రామయ్య, భాగిరెడ్డి నాగిరెడ్డి అన్నారు. మండలంలోని కొణిదేల గ్రామంలో వెలసిన వినాయక స్వామి ఆలయా నికి 1976లో గుంతా వెంగయ్య అనే దాత 6.18 ఎకరాల భూమిని ఇచ్చారని గ్రామస్థులు తెలిపారు. ఆ భూమిని దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించడానికి మూడు సార్లు గ్రా మంలో దండోరా వేయించి వెంటనే మరలా ఏ కారణాలు చెప్పకుండానే అర్ధాంతరంగా వాయిదా వేసి వెళ్లిపోతున్నారని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలు విశ్వహిందూ పరిషత్, బజరంగదల్ నాయకుల దృష్టికి తీసుకుని వెల్లారని నాయకులు తెలిపారు. దీనితో గురువారం నంద్యాల, కర్నూలు జిల్లా వీహెచ్‌పీ, బజరంగదల్ నాయకులు గ్రామంలో వినాయక స్వామి దేవాలయం వద్ద పెద్ద ఎత్తున గ్రామస్థులతో కలిసి నిరసన తెలిపారు. దేవాలయ భూమిని గ్రామంలో కొంత మంది కాజేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. వీహెచ్‌పీ జిల్లా నాయకుల కిషోర్‌కుమార్, నాగరాజు, వెంకటేష్, ఆవుల రెడ్డి, గ్రామ నాయకులు చల్లా వెంకటరెడ్డి, చెల్లా లక్ష్మిరెడ్డి, సత్యంరెడ్డి, దాసరి నాగరాజు, గుట్టపాటి ఆంజనేయులు, సంజీవరెడ్డి, టీడీపీ నాయకులు కుర్వ చిన్న శివన్న, వంగాల ప్రదీప్‌రెడ్డి, వంగాల సతీష్‌రెడ్డి చల్లా రాజశేఖరెడ్డి గ్రామస్థులు పాల్గొన్నారు.