Kurnool Woman Maoist: అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో కర్నూలు మహిళ మృతి
ABN , Publish Date - May 26 , 2025 | 04:16 AM
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుగా మారిన కర్నూలు మహిళ లలిత మృతి చెందింది. ఆమె గతంలో నర్సుగా ఉద్యోగం చేసి, ఆపై మావోయిస్టు ఉద్యమంలో చేరింది.
నర్సు ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు..
కేఎన్‌పీఎస్‌లో పనిచేస్తూ మావోయిస్టు ఉద్యమంలోకి
కర్నూలు/ఆస్పరి, మే 25(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్లోని అబూజ్‌మడ్‌లో ఈనెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయుస్టుల్లో కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల లలిత (45) అలియాస్ సంగీత కూడా ఉన్నారు. ఆమె మృతిపై సమాచారం రావడంతో కుటుంబసభ్యులు మృతదేహం కోసం ఛత్తీ్‌సగఢ్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన గోనెగండ్ల దుబ్బన్న, ఎస్తేరమ్మ దంపతులకు కుమార్తె లలిత. స్వగ్రామంలోనే ఐదో తరగతి వరకు చదువుకున్న ఆమె.. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు సాధించింది. అక్కడ 10వ తరగతి వరకు చదువుకొని, ఆ తర్వాత నంద్యాలలో నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది. తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. ఉద్యోగం చేస్తూనే కేఎన్‌పీఎ్‌స చేపట్టే ఉద్యమాలు, ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనేది. మావోయిస్టు పార్టీ పిలుపుతో దండకారణ్యంలో ఆదివాసీలకు నర్సుగా సేవలందించేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. 20 ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీలో పనిచేసి, నంబాల కేశవరావు బృందంలో ఉంటూ.. తాజాగా ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగింది. ఇదే ఎన్‌కౌంటర్‌లో కర్నూలు జిల్లాకు చెందిన 8 మంది చనిపోయారని సమాచారం.