Share News

KA Paul: కృష్ణయ్య లాంటి వారు ఉన్నంత కాలం బీసీలు బాగుపడరు: కేఏ పాల్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:55 AM

విశాఖపట్నంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగుపడే సూచనలు కనిపించడం లేదన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మధ్య అప్పుడే విభేదాలు ప్రారంభమయ్యాయన్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ తన వల్లే ఆగిందని ఆయన చెప్పారు.

KA Paul: కృష్ణయ్య లాంటి వారు ఉన్నంత కాలం బీసీలు బాగుపడరు: కేఏ పాల్‌

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్‌.కృష్ణయ్యలాంటి వారు ఉన్నంత కాలం బీసీలు బాగుపడరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. విశాఖపట్నంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగుపడే సూచనలు కనిపించడం లేదన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మధ్య అప్పుడే విభేదాలు ప్రారంభమయ్యాయన్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ తన వల్లే ఆగిందని ఆయన చెప్పారు. కేంద్రం రూ.11 వేల కోట్లు ఇస్తామని చెబుతోందని, రూ.11 కోట్లు కూడా ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. అదానీ పోర్టుకు ఇచ్చిన స్టీల్‌ప్లాంటు భూములు తిరిగి వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. దావోస్‌ వెళ్లిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి ఫొటోలకు పోజులు ఇచ్చి వచ్చారన్నారు. షర్మిల, పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్లుగా మారిపోయారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 25 , 2025 | 04:58 AM