Share News

త్వరలో వైసీపీ ఖాళీ

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:29 AM

వైసీపీకి చెందిన 200 మంది జనసేన పార్టీలో చేరారు.

త్వరలో వైసీపీ ఖాళీ

ఆ పార్టీ కీలకనేతలు జనసేనలో చేరబోతున్నారు

జనసేన ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను

విద్యాధరపురం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో తాడు, బొంగరం లేని ఏకైక పార్టీ వైసీపీ. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తన కేసులు గురించే చూసుకుంటున్నారు. వైసీపీలో కీలక నేత లు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పని అయి పోయింది. త్వరలో ఆ పార్టీ ఖాళీ అవబోతోంది.’ అని జనసేన పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. శుక్రవారం భవానీపురం హెచ్‌బీ కాలనీలోని వీఎంసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో భవానీపురానికి చెం దిన వైసీపీ నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 200 మంది జనసేన పార్టీలో చేరారు. ఉదయభాను వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలు జగన్‌కు అధికారం ఇస్తే రావణకాష్టంగా మార్చారన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను ఇక ఎన్నటికీ నమ్మబోరన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 01:29 AM