ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:44 AM
వ్యర్థాల సేకరణలో జాప్యం ఉండ రాదని, వ్యర్థాలను ఎప్పటిక ప్పుడు తొలగిస్తుండాలని విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర అఽధికారులను దేశించారు.

ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలి
నగర కమిషనర్
ధ్యానచంద్ర
గుణదల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వ్యర్థాల సేకరణలో జాప్యం ఉండ రాదని, వ్యర్థాలను ఎప్పటిక ప్పుడు తొలగిస్తుండాలని విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర అఽధికారులను దేశించారు. మంగళవారం ఉద యం తన పర్యటనలో భాగంగా శిఖామణి సెంటర్, బాడవపేట, ఉడ్‌పేట, గుణదల ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ వ్యర్థాలను కచ్చితంగా సేకరించాలని, రోడ్డుపై ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు ట్రాక్టర్లతో గార్బజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించాలని చెప్పారు. నగరంలో ఉన్న అన్ని మరుగుదొడ్లను మరమ్మతులు చేయించాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడా లన్నారు. గుణదల ఉత్సవాలకు కల్పిస్తున్న సౌకర్యాల్లో లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వి ప్రసాద్, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఉన్నత అధికారులు పి.సత్యకుమారి, జి.సామ్రాజ్యం, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.