Share News

వల్లభనేని వంశీ అరెస్టు ముమ్మాటికీ సబబే

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:17 AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయ డం ముమ్మాటికీ సబబేనని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురా లు తలశిల స్వర్ణలత అన్నారు.

వల్లభనేని వంశీ అరెస్టు ముమ్మాటికీ సబబే

తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత

నాగాయలంక, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయ డం ముమ్మాటికీ సబబేనని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురా లు తలశిల స్వర్ణలత అన్నారు. వల్లభనేని వంశీ విధ్వంసకారుడని, గన్నవరంలో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్లు తగలబెట్టి పార్టీ ఆఫీసు ను ధ్వంసం చేయించారని, నారా భువనేశ్వరిని నీచమైన మా టలతో తూలనాడారని, వంశీ లాంటి వాళ్లు సమాజంలో ఉండ టం ప్రమాదకరమని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తంచేశారు.

Updated Date - Feb 14 , 2025 | 01:17 AM