15లోపు స్వయం సహాయక బృందాల ప్రొఫైలింగ్ పూర్తిచేయండి
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:46 AM
స్వయం సహాయక బృందాలు ఈనెల 15వ తేదీ లోపు ప్రొఫైలిగ్ ప్రక్రియను పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు.

పాత రాజరాజేశ్వరిపేట, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : స్వయం సహాయక బృందాలు ఈనెల 15వ తేదీ లోపు ప్రొఫైలిగ్ ప్రక్రియను పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. పెజ్జోనిపేట, పూర్ణానందంపేట, హార్ట్‌పేట, పప్పుల మిల్లు ప్రాంతాల్లోని సచివాలయా లను బుధవారం తనిఖీలు చేశారు. సచి వాలయాల్లో ఆర్‌పీలు చేస్తున్న ఆన్‌లైన్ ఎస్‌హెచ్‌జీ ప్రొఫైలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పెజ్జోనిపేట లోని ఓ నివాసంలో ఏర్పాటు చేసిన సూర్యఘర్ ప్లాంట్‌ను పరిశీలించారు.