విద్యుత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:53 AM
స్క్యూ బ్రిడ్జి సెక్షన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల గృహాలు, వాణిజ్య సముదా యాలపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

విద్యుత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
రామలింగేశ్వరనగర్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): స్క్యూ బ్రిడ్జి సెక్షన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల గృహాలు, వాణిజ్య సముదా యాలపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్‌ఈ బి.విజయ కృష్ణ, ఈఈ పి.విజయకుమారి, విజయవాడ సిటీ ఈఈ పి.రవీంద్ర బాబు ఆధ్వర్యంలో అధికారులు 49బృందాలుగా ఏర్పడి 2833 గృహ సర్వీసులు, 346 వాణిజ్య సముదాయాల సర్వీసులను తనిఖీ చేశారు. వాటిలో 243 సర్వీసులకు ఆదనపులోడు 333కెడబ్ల్యూ మొత్తానికి 7,68,350 ఫైన్ విధించడంతో పాటు విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, వారిపై చట్టపర చర్యలు తీసుకోనున్నారు. ఈ తనిఖీల్లో డీఈఈ పి.శ్రీధర్, ఏఈ పి.సతీష్ కుమార్, ఇతర డీఈఈలు, ఏఈలు, జేఈలు ఫోర్‌మెన్లు తదితరులు పాల్గొన్నారు.