Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:18 AM

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

గూడూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. గూడూరు మండలం పర్ణశాల వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. బైక్‌ నడుపుతున్న యువకుడి తలకు బలమైన గాయమైంది. 108 వాహనంలో ఇద్దరినీ బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 14 , 2025 | 01:18 AM