Share News

విజయవాడలో రైలు కోచ్‌ దగ్ధం

ABN , Publish Date - Feb 06 , 2025 | 01:46 AM

విజయవాడలో రైలు కోచ్‌ దగ్ధమైన సంఘటన బుధవారం రాత్రి జరిగింది.

విజయవాడలో రైలు కోచ్‌ దగ్ధం

రైల్వేస్టేషన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో రైలు కోచ్‌ దగ్ధమైన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. విజయవాడ రైల్వే లోకో షెడ్‌ సమీపంలో ఒక ఎక్స్‌ప్రెస్‌ ఖాళీ ఏసీ రైలు నిలిపారు. రైలు కోచ్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటం స్థానికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది రైలు వద్దకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 06 , 2025 | 01:46 AM