Share News

నేడు నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:27 AM

శనివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు తెలిపారు.

నేడు నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు

మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు

గుణదల, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో యూ ఫోరియా మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాన్ని నగరంలోని ఇం దిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నందున శనివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు హాజరవుతారని, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం పరిసర ప్రాం తాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తామని సీపీ తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ముందుగా తెలియజేసిన ప్రదేశాల్లోనే వారి వాహనాలను పార్క్‌ చేయాల్సి ఉం టుందని, ఎక్కడపడితే అక్కడ పార్క్‌ చేయొద్దని సూచించారు.

వాహనాల మళ్లింపు ఇలా..

ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా స్వర్ణపాలెస్‌, దీప్తి సెంటర్‌చుట్టుగుంట, పడవలరేవు, గుణదల, రామవరప్పాడు రింగ్‌ మీదుగా బెంజిసర్కిల్‌ వైపు మళ్లిస్తారు

ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి బందర్‌ లా కులు, రాఘవయ్య పార్క్‌, పాత ఫైర్‌స్టేషన్‌ రోడ్‌, అమెరికన్‌ హాస్పిటల్‌, మసీదురోడ్డు, నేతాజీ బ్రిడ్జి, గీతానగర్‌, స్ర్కూబ్రిడ్జి మీదుగా బెంజిసర్కిల్‌ వైపు మళ్లిస్తారు.

బెంజిసర్కిల్‌ వైపు నుంచి బందర్‌ రోడ్డులో కి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్‌ నుంచి ఫకీరుగూడెం-స్ర్కూబ్రిడ్జి-నేతాజిబ్రిడ్జి- బ స్టాండ్‌ వైపునకు మళ్లిస్తారు.

రెడ్‌ సర్కిల్‌ నుంచి ఆర్టీఏ జంక్షన్‌-శిఖామ ణి సెంటర్‌ నుంచి వెటర్నరీ జంక్షన్‌ వర కు వాహనాలకు అనుమతి లేదు.

బెంజి సర్కిల్‌ నుంచి డీసీపీ బంగ్లా కూ డలి వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు.

Updated Date - Feb 15 , 2025 | 01:27 AM