మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఎంఎస్‌ఎంఈ దోహదం
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:12 AM
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఎన్నో పథకాలను అందిస్తోందని ఆ సంస్థ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.సుదర్శన్ బాబు తెలిపారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి
ఎంఎస్‌ఎంఈ దోహదం
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.సుదర్శన్ బాబు
మొగల్రాజపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఎన్నో పథకాలను అందిస్తోందని ఆ సంస్థ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.సుదర్శన్ బాబు తెలిపారు. జనశిక్షణా సంస్తాన్ మొగల్రాజపురం కార్యాలయంలో బుధవారం తరుణీ తరంగాలు సంస్థ సహకారంతో నూతన పారిశ్రామిక విధానం -మహిళకు ప్రోత్సాహకాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తమ సంస్థ సూక్ష్మ చిన్నమధ్య తరహా పరిశ్రమలకు కోట్లలో పెట్టుబడి సమకూర్చడం వల్ల ఫుడ్, క్లాత్, కిరాణా, వస్తు ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్ప డానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలు పెట్టుకునే వారికి యంత్రాలు సమకూరుస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టీస్ సంఘం గౌరవాధ్యక్షుడు బాయన వెంకట్రావు మాట్లాడుతూ వృత్తి విద్య నేర్చుకున్న వారికి ఎంఎస్‌ఎంఈ ఎంతో సాయంగా ఉంటుందన్నారు. రాజేశ్వరి ఇండస్ట్రీస్ ఎండీ కె.కనకదుర్గ, కోవే ఇండియా జాతీయ కోశాధికారి డి. అపర్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంస్థాన్ చైర్‌పర్సన్ డాక్టర్ నాగళ్ల విధ్యాఖన్నా అధ్యక్షత వహించగా డైరెక్టర్ ఎ. పూర్ణిమ, తరుణీ తరంగాల సభ్యులు, సంస్థాన్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.