Share News

ఘంటసాల గానం తెలుగు జాతికి వరం

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:46 AM

చలనచిత్ర నేపథ్య గాయకుడు, తన స్వరంతో తెలుగు చలన చిత్ర సీమను సుసంపన్నం చేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల స్వర రసోదయశాల అని పలు కళాసంస్థల ప్రముఖులు అన్నారు.

ఘంటసాల గానం తెలుగు జాతికి వరం
ఘంటసాల విగ్రహం వద్ద అంజలి ఘటిస్తున్న కళాసంస్థల ప్రముఖులు

ఘంటసాల గానం తెలుగు జాతికి వరం

విజయవాడ కల్చరల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) :చలనచిత్ర నేపథ్య గాయకుడు, తన స్వరంతో తెలుగు చలన చిత్ర సీమను సుసంపన్నం చేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల స్వర రసోదయశాల అని పలు కళాసంస్థల ప్రముఖులు అన్నారు. మంగళ వారం సాయంత్రం తుమ్మలపల్లి వారి కళాక్షేత్ర య్య కళాక్షేత్రంలో ఘంటసాల సంగీత కళా వేదికచే 2009లో ఆవిష్కరించబడిన ఘంట సాల విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. శ్రీ కళాభారతి, ఘంటసాల సంగీత కళావేదిక అధ్యక్షులు శింగంశెట్టి చంద్రశేఖర్‌, జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు, బోడి ఆంజనేయరాజు, గాయకులు డేవిడ్‌రాజు, శ్యాంప్రసాద్‌, చంద్రశేఖర్‌, డాక్టర్‌ రామతీర్థ, మండవ దామోదరశివ తదితరులు మాట్లాడుతూ ఘంటసాల గానం తెలుగు జాతికి వరమని, ఆయన పాట ఆయన గానం పాటకు ప్రాణం అని, ఘంటసాల చిరస్మరణీయుడని శాస్ర్తీయ సంగీత విద్వాంసునిగా, నేపఽథ్య గాయకునిగా ఆయన కీర్తి అజరామరమన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:46 AM