ముసాయిదా నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:57 AM
వాహన కాలపరిమితిని కుదిస్తూ కేంద్రం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ది కృష్ణా డిస్ర్టిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేసన్ డిమాండ్ చేసింది.

లబ్బీపేట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వాహన కాలపరిమితిని కుదిస్తూ కేంద్రం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ది కృష్ణా డిస్ర్టిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేసన్ డిమాండ్ చేసింది. 12 ఏళ్లకంటే పాత వాహనాలపై ఆంక్షలు విధి స్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7న జారీ చేసిన డ్రాఫ్ట్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కేం ద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శికి లేఖ పంపినట్టు అధ్యక్షులు నాగమోతు రాజా, ప్రధాన కార్యదర్శి అల్లాడ వీరవెంకట సత్యనారాయణ తెలిపారు.