Share News

చేనేతను ప్రోత్సహించడమే లక్ష్యం

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:36 AM

నైపుణ్యం కలిగిన కళా కారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘గ్రామీణ భారత్‌ మహోత్సవ్‌- ఆంధ్రప్రదేశ్‌ 2025’ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

చేనేతను ప్రోత్సహించడమే లక్ష్యం
హస్తకళా ప్రదర్శనను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ, నాబార్డు సీజీఎం ఎం.ఆర్‌. గోపాల్‌

చేనేతను ప్రోత్సహించడమే లక్ష్యం

గ్రామీణ భారత మహోత్సవం-ఆంధ్రప్రదేశ్‌-2025 ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ లక్ష్మీశ

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): నైపుణ్యం కలిగిన కళా కారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘గ్రామీణ భారత్‌ మహోత్సవ్‌- ఆంధ్రప్రదేశ్‌ 2025’ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. విజయవాడలోని మారిస్‌ స్టెల్లా ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శుక్రవారం కలెక్టర్‌ లక్ష్మీశ , నాబార్డు సీజీఎం ఎం.ఆర్‌.గోపాల్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాబార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ ఏటా నిర్వహి స్తున్నట్లే ఈ ఏడాది కూడా రాష్ట్రస్థాయి చేనేత, హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేయడం సంతోషంగా వుందన్నారు. సంప్రదాయ చేనేత, హస్తకళలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఆప్‌ఫార్మ్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ ఉత్ప త్తులను ప్రోత్సహించడానికి, నాబార్డు మార్కె టింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకొం టుందన్నారు.ఈ నెల 23 వరకు జరగనన్న ఈ ప్రదర్శనలో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొం దూరు ఖద్దరు, తెలంగాణ ప్రత్యేకతలైన నారాయణపేట సిల్క్‌, కాటన్‌ చీరలు, సిక్కోలు కాటన్‌ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నా యన్నారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్తకళలు, ధర్మవరం పట్టుచీరలు, శ్రీ బాలాజీ కాటన్‌ సిల్క్‌, కొండపల్లి, ఏటికొప్పాక వంటి సంప్రదాయ కళాఖండా లతో పాటు, తమిళనాడు నుంచి ప్రత్యే కంగా వచ్చిన నవసారిగై ఆఫ్‌ పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యత సంత రించుకొన్నాయన్నారు.

నాబార్డు సీజీఎం ఎం.ఆర్‌.గోపాల్‌ (ఏపీ) మాట్లాడుతూ గ్రామీణ భారతదేశ అభివృద్ధి కోసం నాబార్డు చేస్తున్న సమగ్ర కృషిని వివరిం చారు. నాబార్డు జనరల్‌ మేనే జర్‌ (ఏపీ) డాక్టర్‌ కేవీఎస్‌ ప్రసాద్‌ అతిథులకు, కళాకా రులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్‌ ఎండీ డాక్టర్‌ ఆర్‌.శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఎల్‌ బీసీ ఏజీఎం శ్రీనివాస్‌ దాసియం, నాబార్డు డీజీఎం ఎం.శ్రీరామచంద్రమూర్తి, పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:36 AM