ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:57 AM
ఆర్టీసీ ప్యాసింజర్ బస్సును వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టిన ఘటనలో టాటా ఏస్ డ్రైవర్, టీడీపీ ఆకుమర్రు గ్రామ అధ్యక్షుడు బొల్లా మోహనరావు మృతి చెందాడు.

టాట్ ఏస్ డ్రైవర్ దుర్మరణం.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు
గూడూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం - విజయవాడ జాతీ య రహదారిపై చిట్టిగూడూ రు వద్ద గురువారం విజయవాడ నుంచి బందరు వస్తున్న ఆర్టీసీ ప్యాసింజర్ బస్సును వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టిన ఘటనలో టాటా ఏస్ డ్రైవర్, టీడీపీ ఆకుమర్రు గ్రామ అధ్యక్షుడు బొల్లా మోహనరావు మృతి చెందాడు. మోహనరావు రోజూ ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడ సర్వీస్ చేస్తుంటాడు. బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగు గాయపడటంతో చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.