Share News

సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని ఎంచుకోవాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:38 AM

విద్యార్థులు సమయస్ఫూర్తితో సరైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని వక్తలు ఉద్ఘాటించారు.

 సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని ఎంచుకోవాలి
విదేశీయులతో కళాశాల యాజమాన్యం

సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని ఎంచుకోవాలి

భారతీనగర్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సమయస్ఫూర్తితో సరైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని వక్తలు ఉద్ఘాటించారు. ఆంధ్రా లయోలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఐక్యూఎసీ సెల్‌ కన్వీనర్‌ క్యాండీ ఆధ్వర్యంలో కళాశాల సెమినార్‌ హాలో సరైన లక్ష్యాన్ని ఎన్నుకోవడం అంశంపై సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా అమెరికా దేశంలోని ఫ్లోరిడాకి చెందిన సబ్రరీనా, లారీ, హోళి, జిమ్‌, కార్ల, ఎమిలీ,కారెన్‌, పాట్రిక్ల్‌, ఫాదర్‌ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకునే లక్ష్యమే వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ ఫాదర్‌ బి. జోజిరెడ్డి, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:38 AM