ముగిసిన సుబ్బారాయుడి కల్యాణ మహోత్సవాలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:15 AM
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు స్వామి పవళింపు సేవతో ముగిశాయి.

మోపిదేవి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు స్వామి పవళింపు సేవతో ముగిశాయి. మాఘ శుద్ధ చవితి ఆదివారం స్వామిని పెండ్లి కుమారుడిని చేయడంతో కల్యాణ మహోత్సవాలు ప్రారంభమై మాఘశుద్ధ నవమి గురువారం రాత్రి పవళింపు సేవతో ముగిశాయి. మహోత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వాదశ ప్రదక్షిణల కార్యక్రమాన్ని అర్చక బృందం శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు బుద్ధు పవన్ కుమార్‌శర్మ, వే ద పండితులు శాస్త్రోక్తంగా పవళింపు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేష అలంకరణ చేసిన స్వామి, అమ్మవార్లకు కల్యాణ మండపంలో పవళింపు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.