Share News

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:29 AM

విద్యార్థులు చదువులతోపాటు ఆటల్లో కూడా రాణించాలని ఎంపీ కేశినేని శివనాధ్‌ (చిన్ని) అన్నారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
క్రీడా సామగ్రిని అందజేస్తున్న ఎంపీ కేశినేని చిన్ని

వన్‌టౌన్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువులతోపాటు ఆటల్లో కూడా రాణించాలని ఎంపీ కేశినేని శివనాధ్‌ (చిన్ని) అన్నారు.కేబీఎన్‌ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో బుధవారం ఆయన విజయవాడ, తిరువూరు డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా కిట్లు పంపిణీ చేశారు. నారా లోకేశ్‌ జన్మదినం రోజు క్రీడా కిట్లను అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించి తొలుత పశ్చిమ నియోజకవర్గంలోని అయిదు పాఠశాలలకు అందించామన్నారు. జిల్లాలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ ఎంపీ తన సొంత నిధులతో క్రీడా సామగ్రిని సమకూర్చటం అభినందనీయమన్నారు. డాక్టర్‌ వి.నారాయణ రావు, టి.శ్రీనివాస్‌, ఎం.ఎస్‌.బేగ్‌, ఫతావుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:29 AM