Share News

కుంభమేళాకు పర్యాటకశాఖ ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:10 AM

కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న ఏపీ, తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

కుంభమేళాకు పర్యాటకశాఖ ప్రత్యేక బస్సులు

వన్‌టౌన్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న ఏపీ, తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

మొదటి రూటులో..

బస్సు ఫిబ్రవరి 11న తిరుపతిలో ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. తిరుపతి- ఒంటిమిట్ట- కడపబైపాస్‌- ఓర్వకల్లు, కర్నూలు బైపాస్‌- హైదరాబాద్‌- జబల్‌పూర్‌- చిత్రకూటు-ప్రయాగరాజ్‌-కాశి-నాగపూర్‌-ధర్మపురిలలో యాత్రికులను దించుతారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరేవారు ఫిబ్రవరి 12న ఉదయం 5 గంటలకు బారామతి హోటల్‌ వద్ద బస్సు ఎక్కాలి. హైదరాబాద్‌ యాత్రికులకు ఫిబ్రవరి 17న మధ్యాహ్నంతో యాత్ర ముగుస్తుంది. కర్నూలు యాత్రికులకూ ఇదే రోజు సాయంత్రం 5 గంటలకు, కడప, తిరుపతివారికి 18 వతేదీ మధ్యాహ్నానికి యాత్ర పూర్తవుతుంది. తిరుపతి, కడప నుంచి నుంచి బయలుదేరే పెద్దలు(ఒకరికి) రూ.22 వేలు, పిల్లలకు(ఒకరికి) రూ.19 వేలు, కర్నూలు, హైదరాబాద్‌ నుంచి బయలుదేరే పెద్దలకు రూ.20 వేలు, పిల్లకు రూ 17,200 చెల్లిం చాలి. వివరాలకు తిరుపతి 98480 07033, కడప 9010 318811, కర్నూలు 96401 77759, హైదరాబాద్‌ 77298 30011లో సంప్రదించాలి.

రెండోరూటులో..

బస్సు ఫిబ్రవరి 12వతేదీ ఉదయం 6 గంటలకు నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయం వద్ద బయలుదేరుతుంది. నెల్లూరు-విజయవాడ-రాజమహేంద్రవరం-అన్నవరం-విశాఖపట్నం-పూరి-కోణార్క్‌-భువనేశ్వర్‌-కటక్‌-చండీపూర్‌-గయ-బుద్దగయ-కాశి-ప్రయాగ్‌రాజ్‌కు చేరుతుంది. యాత్ర ముగించుకుని తిరి గి శ్రీకూర్మం-అరసవల్లి-మీదుగా విశాఖపట్నం-విజయవాడకు చేరుకుంటుంది. నెల్లూరు యాత్రికులకు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేయిస్తారు. తిరిగి నెల్లూరు చేరుస్తారు. విజయవాడలో బరంపార్కు వద్ద, రాజమండ్రి వాళ్లు మహాకాళేశ్వర ఆలయం వద్ద బస్సు ఎక్కాలి. 13న ఉదయం 5 గంటలకు విశాఖపట్నంలో బీచ్‌రోడ్డులోని హోటల్‌ రాగా వద్ద ఎక్కాలి. విశాఖపట్నం యాత్రికులకు 18న రాత్రి 10 గంటలకు యాత్ర ముగుస్తుంది. 19న ఉదయం 10 గంటలకు రాజమండ్రి వారికి, అదేరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవాడ వారికి, రాత్రి 8 గంటలకు నెల్లూరు వారికి పూర్తవుతుం ది. నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి నుంచి వెళ్లే పెద్ద లు(ఒకరికి) రూ.25,600, పిల్లలు(ఒకరికి) రూ.22,500, విశాఖపట్నంలో ఎక్కే పెద్దలు రూ.24,100, పిల్లలు రూ.21,200 చెల్లించాలి. దర్శనాలు, భోజనాలు, అల్పాహారం, బస ఖర్చులను యాత్రికులే భరించాలి. వివరాలకు నెల్లూరు 98480 07024, రాజమండ్రి 98486 29341, విజయవాడ 98480 07025 విశాఖపట్నం 98488 13584, 98480 07022లో సంప్రదించాలి. ఏపీటీడీసీ, టూరిజంఏపీ వెబ్‌సైట్లు లేదా అధీకృత ఏజెంట్ల ద్వారా సీట్లు రిజర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - Feb 01 , 2025 | 01:10 AM