Share News

దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ విజేతలకు కలెక్టర్‌ అభినందన

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:31 AM

దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో జిల్లా తరపున పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను శుక్రవారం కలెక్టర్‌ లక్ష్మీశ అభినందించారు.

దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌  విజేతలకు కలెక్టర్‌ అభినందన
విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌

విజేతలకు కలెక్టర్‌ అభినందన

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో జిల్లా తరపున పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను శుక్రవారం కలెక్టర్‌ లక్ష్మీశ అభినందించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలోజరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను అభినందించారు. పుదుచ్చేరిలో జనవరి 20 నుంచి 25 వరకు జరిగిన దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్‌ విజ్ఞాన ప్రదర్శనలో రెండు ప్రాజెక్టులు పాల్గొనగా రెండింటికీ అవార్డు రావడం పట్ల కలెక్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు. మోడల్‌ స్కూల్‌ తరపున (గంపలగూడెం మోడల్‌ స్కూల్‌ విద్యార్థి)రోలింగ్‌ రోబోతో సుదక్ష విజేతగా నిలవగా, జగ్గయ్యపేట జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌ తరపున పాల్గొన్న భార్గవ్‌, చైతన్య గ్రూపు వరదలలో వంతెనలు ఏ విధంగా నిర్మించుకోవాలి, వాహనాలను, ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలనే ప్రాజె క్టుతో విజేత లుగా నిలిచారు. కలెక్టర్‌ క్యాంపు కార్యా లయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి యూవీ సుబ్బారావు, జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ మైనం హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:31 AM