Share News

నేటి నుంచి సిద్ధేంద్ర యోగి జయంత్యుత్సవాలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:17 AM

అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో కూచిపూడి సిద్ధేంద్ర యోగి నాట్య కళావేదికపై శనివారం నుంచి రెండు రోజులపాటు సిద్ధేంద్ర యోగి జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళామండలి కార్యదర్శి పసుమర్తి మృత్యుంజయశర్మ తెలిపారు.

నేటి నుంచి సిద్ధేంద్ర యోగి జయంత్యుత్సవాలు

కూచిపూడి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో కూచిపూడి సిద్ధేంద్ర యోగి నాట్య కళావేదికపై శనివారం నుంచి రెండు రోజులపాటు సిద్ధేంద్ర యోగి జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళామండలి కార్యదర్శి పసుమర్తి మృత్యుంజయశర్మ తెలిపారు. శని, ఆదివారాల్లో కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలిరోజైన శనివారం అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి విద్యార్థులతో కూచిపూడి నాట్య ప్రదర్శన, అనంతరం విశాఖపట్నానికి చెందిన నాట్య సన్నిధాలయం విద్యార్థులతో కూచిపూడి నాట్యం, కూచిపూడి సంప్రదాయ భామాకలాప నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగింపు రోజైన ఆదివారం నాద పద్మ, నందిపల్లి సాహితీల సోలో అభినయం, అనంతరం గోనుగుంట శైలశ్రీ బృందం, శ్రీ లలితా స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ విద్యార్థులతో కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు మృత్యుంజయశర్మ తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 01:17 AM