Share News

సిద్ధేంద్ర యోగి నాట్యోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 09 , 2025 | 01:38 AM

అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో సిద్ధేంద్ర యోగి జయంతి నాట్యోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

సిద్ధేంద్ర యోగి నాట్యోత్సవాలు ప్రారంభం
పూర్వరంగం అంశంలో కూచిపూడి నాట్య కళామండలి విద్యార్థుల అభినయం

కూచిపూడి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో సిద్ధేంద్ర యోగి జయంతి నాట్యోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సిద్ధేంద్ర యోగికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. సిద్ధేంద్ర కళావేదికపై కళాకారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ఆహుతులను అలరించాయి. అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి విద్యార్థులుకూచిపూడి నాట్యంలో పూర్వరంగం అంశాన్ని ప్రదర్శించి నాట్యాంశాలకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నానికి చెందిన నాట్య సన్నిధాలయ విద్యార్థులు రాజసాగి నేతృత్వంలో ప్రదర్శించిన అంశాలు రంజింపచేశాయి. నిర్వాహకులు పసుమర్తి మృత్యుంజయ శర్మ, హరనాథ శాస్త్రిలు అతిథులు, కళాకారులను సత్కరించారు. ప్రముఖ నాట్యాచార్యుడు డాక్టర్‌ వేదాంతం రాధే శ్యామ్‌, డాక్టర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 01:38 AM