Share News

టమాటాలు నేరుగా రైతుబజార్లలో అమ్ముకోండి

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:24 AM

ముదురు తోటల్లోని టమాటాలను రైతులు నేరుగా సమీపంలోని రైతుబజార్లలో అమ్ముకోవచ్చని ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ అధికారులు సూచించారు.

టమాటాలు నేరుగా రైతుబజార్లలో అమ్ముకోండి
లేత టమాటా తోటలను పరిశీలిస్తున్న ఉద్యాన, మార్కెటింగ్‌శాఖల అధికారులు

రైతులతో ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ అధికారులు

జి.కొండూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ముదురు తోటల్లోని టమాటాలను రైతులు నేరుగా సమీపంలోని రైతుబజార్లలో అమ్ముకోవచ్చని ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ అధికారులు సూచించారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారని వారు తెలిపారు. టమాటా కేజీ 4 రూపాయలు అనే శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గడ్డమణుగు గ్రామంలోని టమాటా తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంట పండించే నాటి నుంచి మార్కెంటింగ్‌ చేసుకునే వరకు టమాటా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హెచ్‌వో నీలిమ, మైలవరం ఎస్టేట్‌ అధికారి పి.చిట్టిబాబు, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 01:24 AM