Share News

పవిత్రమైనది వైద్య వృత్తి

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:31 AM

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని చిరునవ్వుతో సేవలందించి రోగుల మన్ననలు పొందాలని ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులకు హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ గుండె వైద్య నిపుణుడు డాక్టర్‌ పి.కృష్ణంరాజు సూచించారు.

పవిత్రమైనది వైద్య వృత్తి
ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్న డాక్టర్‌ కృష్ణంరాజు

చిరునవ్వుతో రోగులకు సేవలందించండి

ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులతో గుండె వైద్య నిపుణుడు డాక్టర్‌ కృష్ణంరాజు

పిన్నమనేని సిద్ధార్థలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే

గన్నవరం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని చిరునవ్వుతో సేవలందించి రోగుల మన్ననలు పొందాలని ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులకు హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ గుండె వైద్య నిపుణుడు డాక్టర్‌ పి.కృష్ణంరాజు సూచించారు. చిన అవుటపల్లి డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో 19వ గ్రాడ్యుయేషన్‌ డేను శనివారం ఘనంగా నిర్వహించారు. సభకు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీ భీమేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్‌ కృష్ణంరాజు విచ్చేశారు. వైద్య విద్యకు మంచి డిమాండ్‌ ఉందని, ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ కోర్సులు చేయాలని కృష్ణంరాజు సూచించారు. సిద్ధార్థ అకాడమీ లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందని, ఆనాడు ఎంతో మంది మహానుభావుల దాతృత్వంతో నేడు పేద, మధ్య తరగతి విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తోం దని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు అన్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన 142మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. కళాశాల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు, నిమ్మగడ్డ లలితప్రసాద్‌, డాక్టర్‌ సీవీరావు, డాక్టర్‌ బి.అనిల్‌కుమార్‌, ఏవో టీవీ సుబ్బారావు, కాసరనేని నవీన్‌, హిమవంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 01:31 AM