Share News

గుంటూరు నుంచి పార్వతీపురానికి ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:28 AM

గుం టూరు నుంచి పార్వతీపురానికి రోజూ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్సు నడుపుతున్నామని, ప్రజలు వినియోగించుకోవాలని, ఎన్టీఆర్‌ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.యేసుదానం శుక్రవారం ఒక ప్రకటనలో సూచిం చారు.

గుంటూరు నుంచి పార్వతీపురానికి ఆర్టీసీ బస్సు

బస్‌ స్టేషన్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): గుం టూరు నుంచి పార్వతీపురానికి రోజూ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్సు నడుపుతున్నామని, ప్రజలు వినియోగించుకోవాలని, ఎన్టీఆర్‌ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.యేసుదానం శుక్రవారం ఒక ప్రకటనలో సూచిం చారు. 3181 సర్వీసు నెంబరు బస్సు గుంటూరులో రాత్రి 7.15 గంటలకు బయలుదేరి 8.20 గంటలకు విజయవాడ, రాత్రి 10 గంటలకు ఏలూరు, 11.45కు రాజమండ్రి, అర్ధరాత్రి 1.30 గంటలకు అన్నవరం, మరునాడు తెల్లవారుజామున 4.15 గంటలకు విశాఖపట్నం, 5.30 గంటలకు విజయనగరం, 6 గంటల కు గజపతినగరం, 6.40 గంటలకు బొబ్బిలి, 7.15 గంటలకు పార్వతీపురం చేరుకుంటుందని ఆయన తెలిపారు. తిరిగి ఇదే రూటులో 3182 సర్వీసు నెం బరు బస్సు పార్వతీపురంలో సాయంత్రం 4.45 గం టలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు గుంటూరు చేరుకుంటుందని తెలిపారు. విజయవాడ నుంచి పార్వతీపురానికి రూ. 1,140 చార్జీ ఉంటుందన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో ని తాడేపల్లి క్రాస్‌ రోడ్‌, కుంచనపల్లి క్రాస్‌రోడ్‌, మం గళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రి, నిర్మలా కాన్వెంట్‌ బస్టా ప్‌ల వద్ద ఎక్కేందుకు, దిగేందుకు సౌకర్యం ఉందని, అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌, బస్‌స్టేషన్లు, అ ధీకృత ఏజెంట్లవద్ద చేయించుకోవచ్చని సూచించారు.

Updated Date - Feb 15 , 2025 | 01:28 AM