Share News

రూ.20 కోట్ల పంచాయతీ స్థలం కబ్జా

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:41 AM

విజయవాడ రూరల్‌ మండలం, అంబాపురం పంచాయతీలోగల ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగుల సహకార బిల్డింగ్‌ సొసైటీ కాలనీలో రూ.20 కోట్ల విలు వైన పంచాయతీ స్థలం కబ్జాకు గురైందని అంబాపురం సర్పంచ్‌ గండికోట సీతయ్య తెలిపారు.

రూ.20 కోట్ల పంచాయతీ స్థలం కబ్జా
వివరాలు తెలియజేస్తున్న గ్రామ సర్పంచ్‌ సీతయ్య

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 11 (ఆంఽధ్రజ్యోతి): విజయవాడ రూరల్‌ మండలం, అంబాపురం పంచాయతీలోగల ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగుల సహకార బిల్డింగ్‌ సొసైటీ కాలనీలో రూ.20 కోట్ల విలు వైన పంచాయతీ స్థలం కబ్జాకు గురైందని అంబాపురం సర్పంచ్‌ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో వివరాలు తెలిపారు. లే అవుట్‌లో కామన్‌ స్థలంగా వదిలిన 2,226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్‌ అధికారి పి.జక రయ్య రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారని చెప్పారు. ఆ స్థలానికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకున్నా రని, గ్రామ సర్పంచ్‌గా అదేమని ప్రశ్నించిన తనపై జకరయ్య ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిం చారని తెలిపారు. రిటైర్డ్‌ అధికారికి మద్దతుగా నగరా నికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి తనను బెదిరిం చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి అది పంచా యతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. నాలుగు దశాబ్ధాల కిందట ఎఫ్‌సీఐ ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని లే అవుట్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5వేల గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచా యతీకి అప్పగించారని తెలిపారు. ఆ స్థలంలోని కొంత భాగంలో పార్కు ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా, హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జకరయ్య కొంత మంది పలుకుబడి ఉన్న నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కాలనీలో తాగునీటి వసతి లేదని, వాటర్‌ ట్యాంక్‌ నిర్మించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్‌ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా పంచాయతీకి చెందిన 2,226 గజాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్‌ నిర్మించాలని ఇటీవల పంచాయతీ పాలకవర్గం తీర్మా నం చేసిందని చెప్పారు. అనూహ్యంగా ఈ స్థలం తనదని రిటైర్డ్‌ అధికారి పి. జకరయ్య ఫెన్సింగ్‌ వేయడం బాధాకరమన్నారు. స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని, పంచాయతీ స్థలాన్ని ఎట్టి పరిస్థి తుల్లో కబ్జా కానీయమని స్పష్టం చేశారు. ఆ స్థలంలో గతంలో జరిగిన అక్రమ రిజిస్ర్టేషన్లు సైతం రద్దు చేయాలని సబ్‌ కలెక్టర్‌ నుంచి ఆదేశాలు ఉన్నాయని, సంబంధిత ఆదేశిత పత్రాలను ఈ సందర్భంగా చూపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ నాయక్‌, కమిటీ నాయకులు వసంత్‌, చల్లగాని సునీల్‌, భాస్కరరావు, మోహన్‌ రావు, తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని రక్షించాలన్నారు. గ్రామస్తులకు మద్దతుగా టీడీపీ కృష్ణాజిల్లా నాయకులు గుజ్జరపల్లి బాబూరావు, జి.నరసయ్య, కోనేరు సందీప్‌, తదితరులు మాట్లాడిన వారిలో ఉన్నారు. అనంతరం గ్రామస్తులంతా కలిసి నగర పోలీస్‌ కమిషనర్‌కు, విజయవాడ రూరల్‌ మండలం తహసీల్దార్‌కు గ్రామ పంచాయతీ స్థలాన్ని కబ్జా కాకుండా రక్షించాలని వినతి పత్రాలు అందజేశారు.

Updated Date - Feb 12 , 2025 | 12:41 AM