హెల్మెట్ పెట్టు..చాక్లెట్ పట్టు!
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:20 AM
హెల్మెట్ ధరించడం భారం కా దని, అది బాధ్యతని, ప్రాణాలు కాపాడే అస్త్రమని ఉప రవాణా కమిషనర్ ఎ.మోహన్ పేర్కొన్నారు.

హెల్మెట్ ధారణపై వినూత్నంగా అవగాహన
కృష్ణలంక, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): హెల్మెట్ ధరించడం భారం కా దని, అది బాధ్యతని, ప్రాణాలు కాపాడే అస్త్రమని ఉప రవాణా కమిషనర్ ఎ.మోహన్ పేర్కొన్నారు. బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర వాహనదారుల భద్రత కోసం రవాణాఅధికారులు ‘హెల్మెట్ పెట్టుకో చాక్లెట్ పట్టుకో’ అనే నినాదం తో అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్ పెట్టుకుని వాహ నాలు నడిపిన ప్రతి ఒక్కరికీ అధికారులు చాక్లెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీటీసీ ఎ.మోహన్ హాజరయ్యారు. ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ఆర్టీవోలు ఆర్.ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, వాహన తనిఖీ అధికారులు వి.పద్మాకర్, ఎ.ఉదయ్‌శివప్రసాద్, డీవీ రమణ, బి.శ్రావణి, గీతాంజలి, ప్రి యదర్శిని, కేవీ రవిగోపాల్, బి.ఉమామహేశ్వరరావు, రవాణా ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు ఎం.రాజుబాబు పాల్గొన్నారు.