పోర్టు అనుసంధాన రోడ్లకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:54 AM
బందరు పోర్టుకు అవసరమైన అనుబంధ రోడ్ల అభివృద్ధికి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మోర్త్ అండ్ నేషనల్ హైవే అధికారులతో బుధవారం ఎంపీ బాలశౌరి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా ఇటీవల ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పోర్టు అనుసంధానించ వలసిన రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోరగా, మంత్రి వెంటనే నివేదికలు సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
విజయవాడ కలెక్టరేట్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : బందరు పోర్టుకు అవసరమైన అనుబంధ రోడ్ల అభివృద్ధికి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మోర్త్ అండ్ నేషనల్ హైవే అధికారులతో బుధవారం ఎంపీ బాలశౌరి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా ఇటీవల ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పోర్టు అనుసంధానించ వలసిన రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోరగా, మంత్రి వెంటనే నివేదికలు సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రధానంగా పోర్టు నుంచి బందరులోని మాచవరం రైస్‌మిల్ సెంటర్ వరకు 3.7 కి.మీ వరకు 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి, మాచవరం రైస్‌మిల్ సెంటర్ నుంచి నేషనల్ హైవే 65 వద్ద వున్న అండర్‌పాస్ వరకు 4 కి.మీ వరకు ప్రస్తుతం వున్న 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి పరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కోరారు. ఈ విషయమై మోర్త్ అధికారులు డీపీఆర్ తయారుచేయడం జరిగిందని, మొత్తం 12.6 కి.మీకి రూ.583 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని, ఇందులో ఒకచోట రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఒకచోట ఫ్లైఓవర్, ఒకచోట వెహికల్ ఓవర్‌పాస్, ఆరుచోట్ల వెహికల్ అండర్‌పా్‌సలు, 6 చోట్ల వెహికల్ అండర్‌పా్‌సలు నిర్మించడం జరుగుతుందని ఎంపీకి తెలియజేశారు. అలాగే మరో ముఖ్యమైన రోడ్డు గుడివాడ పట్టణంలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి 2.80 కి.మీ సుమారుగా 18 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారుచేయడం జరిగిందని, 4 వరుసల రహదారిని 216-హెచ్ నేషనల్ హైవేతో కలిపే నిమిత్తం, మధ్యలో డివైడర్‌లు, సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీ సౌకర్యంతో అధునాతనంగా రహదారి నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నామని, నాగవరప్పాడు బ్రిడ్జి నుంచి వీకేఆర్ అండ్ వీఎన్‌బీ ఇంజినీరింగ్ కాలేజీ వరకు డ్రైన్లు, పుట్‌పాతలు, సీ్ట్రట్ లైటింగ్, డివైడర్‌లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, అలాగే ఎన్‌హెచ్ 165 నుంచి ఎన్‌హెచ్ 216 హెచ్ వరకు రూ.9 కోట్లతో రోడ్డు విస్తరణకు 3 కి.మీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల సూచనలు, సలహాలతో తగు విధంగా డీపీఆర్ తయారుచేసి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి చేరిన వెంటనే ఢిల్లీలో నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ బాలశౌరి తెలిపారు. సమావేశంలో మోర్త్ రీజనల్ ఆఫీసర్ రాకేష్ కుమార్, ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాస్, నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ ఈఈ సంజీవ రాయుడు, డీఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు.