యాష్‌తో వృత్తిపరమైన అభివృద్ధి
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:33 AM
ప్యూర్ యూత్ క్లబ్ హబ్ కేవలం స్వచ్ఛంద సేవ గురించి మాత్రమే కాకుండా నాయకత్వం, సేవ, ఆవిష్కరణలను సమగ్రపరచడం ద్వారా రాబోయే సామాజిక బాధ్యతగల నాయకులను రూపొం దిస్తుందని ప్యూర్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో డాక్టర్ శైలా తాళ్లూరి పేర్కోన్నారు.

యాష్‌తో వృత్తిపరమైన అభివృద్ధి
ప్యూర్ సంస్థ ఫౌండర్ అండ్
సీఈవో డాక్టర్ శైలా తాళ్లూరి
లబ్బీపేట,ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్యూర్ యూత్ క్లబ్ హబ్ కేవలం స్వచ్ఛంద సేవ గురించి మాత్రమే కాకుండా నాయకత్వం, సేవ, ఆవిష్కరణలను సమగ్రపరచడం ద్వారా రాబోయే సామాజిక బాధ్యతగల నాయకులను రూపొం దిస్తుందని ప్యూర్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో డాక్టర్ శైలా తాళ్లూరి పేర్కోన్నారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, ప్యూర్ యూత్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో యంగ్ ఎంట్రప్రెన్యూర్ స్కిల్ హబ్‌ను(యాష్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ యాష్ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ అనుభవం, వృత్తి పరమైన వృద్ధి అవకాశాలు, బలమైన ప్రపంచ నెట్‌వర్క్‌ను అందిస్తుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ, కెరీర్ అభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, వ్యాపార ఆలోచనలు మిళితం చేసి యువ ఆవిష్కర్తలుగా స్టార్టప్‌లు ప్రారంభించే సువర్ణ అవకాశం ఈ హబ్ కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, రేడియాలజిస్ట్ జి.వి,వరప్రసాద్, బీవీఎస్.కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కల్పన, స్పెషల్ ఆఫీసర్ ఆర్.మాధవి తదితరులు పాల్గొన్నారు.
రక్తహీనత ముక్త భారత్‌పై అవగాహన సదస్సు
సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా గురువారం సిద్ధార్థ మహిళా కళాశాల వెల్‌నెస్ క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్-1,2,3 విభాగాల ఆధ్వర్యంలో రక్తహీనత ముక్త భారత్ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ డైరెక్టర్--2 డాక్టర్ రంజనా బండారి మాట్లాడుతూ ఎర్రరక్త కణాలు తగ్గినప్పుడు ఎనీమియా వస్తుందని, అవయవాలు సరిగా పనిచేయవని, ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, విటమిన్ సీ ఉండే వాటిని, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలన్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ ఎస్.కల్పన, ఆర్.మాధవి, ఎస్.పద్మజ తదితరులు పాల్గొన్నారు.